మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం ఉదయగిరికి తరలింపు

*ప్రజల సందర్శనార్ధం మేకపాటి గెస్ట్ హౌస్ లో గౌతమ్ రెడ్డి భౌతికకాయం

Rama Rao
Updated on: 22 Feb 2022 8:30 AM IST
Mekapati Goutham Reddy Body Was Shifted to Udayagiri | AP News Today
X

మేకపాటి గౌతమ్ రెడ్డి పార్థివదేహం ఉదయగిరికి తరలింపు

Mekapati Goutham Reddy: గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నారు. ముందు గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఆ తర్వాత ఉదయగిరికి మార్చారు. ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్ లో గౌతమ్ రెడ్డి పార్థీవ దేహాన్నిఉంచనున్నారు. విదేశాల్లో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు ఇవాళ సాయంత్రం రానున్నారు. రేపు ఉదయం అక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తరలించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాపతినిధులు పాల్గొననున్నారు.

Rama Rao

Rama Rao

Next Story