Chiranjeevi Oxygen Banks: అందుబాటులోకి చిరు ఆక్సిజన్ బ్యాంక్

#అందుబాటులోకి చిరు ఆక్సిజన్ బ్యాంక్ #ఇవాళ గుంటూరులో తొలి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం

Arun Chilukuri
Published on: 26 May 2021 10:21 AM IST
Chiranjeevi Oxygen Banks: Megastar Chiranjeevi to Open Oxygen Bank In Guntur
X

ఇమేజ్ సోర్స్ (చిరంజీవి ట్విట్టర్ )

Chiranjeevi Oxygen Banks: కోవిడ్ పేషంట్లకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి తలపెట్టిన ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు నేటితో ప్రారంభం కానుంది. కర్ణాటకలో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తొలి చిరు ఆక్సిజన్ బ్యాంకు అందుబాటులోకి రానుంది. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి ఆక్సిజన్ బ్యాంకును నేడు ప్రారంభించనున్నారు.

ఆక్సిజ‌న్ బ్యాంక్ ప‌నుల్ని చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌. ఇక ఆయా ప్రాంతాల‌లో చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు . చిరంజీవి అండ‌గా మెగా అభిమానులు సైతం మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం, త‌మ వంతు విరాళాలు అందించ‌డం గొప్ప విష‌యం అనే చెప్ప‌వ‌చ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story