జనసేన కోసం రంగంలోకి "మెగా ఫ్యాన్స్"

Mega Fans: విజయవాడలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు అత్యవసర సమావేశమయ్యారు.

Arun Chilukuri
Updated on: 22 May 2022 3:45 PM IST
Mega Fans Meeting at Vijayawada
X

జనసేన కోసం రంగంలోకి "మెగా ఫ్యాన్స్"

Mega Fans: విజయవాడలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అభిమానులు అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 13 జిల్లాలకు చెందిన మెగా అభిమానులు పాల్గొన్నారు. అయితే పరిమిత సంఖ్యలో కీలక వ్యక్తులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీకి మద్దుతుగా ఉండేలా తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని.. జనసేన ను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story