Sajjala RamaKrishna Reddy: కోటంరెడ్డి వ్యవహారంపై సమావేశమైన నేతలు

Sajjala RamaKrishna Reddy: కోటంరెడ్డి వ్యవహారంపై సమావేశమైన నేతలు

Dhatripriya
Updated on: 2 Feb 2023 6:51 PM IST
Meeting of YCP chiefs with CM Jagan
X

Sajjala RamaKrishna Reddy: కోటంరెడ్డి వ్యవహారంపై సమావేశమైన నేతలు

Sajjala RamaKrishna Reddy: సీఎం జగన్‌తో వైసీపీ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. నెల్లూరు జిల్లా వ్యవహారంపై సీఎం జగన్‌తో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో సజ్జల, బాలినేని, శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జల ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని సీఎం జగన్‌ సీరియస్‌గా తీసుకున్నారన్నారు. టీడీపీ తరఫున పోటీ చేస్తానని వచ్చిన ఆడియో, వీడియోలు బయటకు రావడంతో కోటంరెడ్డిని పార్టీ నుంచి తప్పించడం జరిగిందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story