TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ

TTD: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం

Sriveni Erugu
Published on: 17 Feb 2022 9:03 AM IST
Meeting of the TTD Governing  today
X

TTD: ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ

TTD: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. 49 అంశాలతో టీటీడీ అధికారులు ఎజెండా రూపొందించారు. ఈ సమావేశంలోనే పాలక మండలి టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2022-23 వార్షిక బడ్జెట్ 3వేల 171 కోట్ల అంచనాగా ప్రవేశపెట్టనుంది టీటీడీ బోర్డు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్ పేరుతో మరో నూతన పథకానికి పాలక మండలి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకానికి లక్ష రూపాయలు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్‌గా ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ స్కీమ్‌కు ఇచ్చిన విరాళాలను చిన్న పిల్లల ఆపరేషన్ ఖర్చులకు వినియోగించనున్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతుకు నిధులు కేటాయించే అంశంపై చర్చించి ఆమోదించనున్నారు. కొవిడ్‌ కేసులు తగ్గుతున్న క్రమంలో దర్శనాల సంఖ్య పెంపుపై కూడా చర్చించనున్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story