ప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన బామ్మర్ది..

Dwaraka Tirumala: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి శివారులోని ఫ్యామిలీ రెస్టారెంట్ లో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 24 May 2022 8:40 PM IST
Married Couple Attacked By Family in Eluru
X

ప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన బామ్మర్ది..

Dwaraka Tirumala: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లి శివారులోని ఫ్యామిలీ రెస్టారెంట్ లో దారుణం జరిగింది. రెస్టారెంట్‌కు వచ్చిన జంటపై యువతి తండ్రి, తమ్ముడు దాడికి తెగబడ్డారు. ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకున్నావంటూ ఇద్దరిపై దాడికి దిగారు. యువకుడు సాంబశివరావు చెవి కొరికి కర్రలతో కొట్టారు. బాధితులు అక్కడి నుంచి తప్పించుకొని ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు.

దెందులూరు మండలం చల్ల చింతలపూడికి చెందిన సాంబశివరావు, పావని 3 నెలల క్రితం విజయవాడలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పావని తల్లిదండ్రులు ఈ పెళ్ళికి నిరాకరించారు. గతంలోనే విజయవాడ పోలీసులకు సాంబశివరావు పావని ఫిర్యాదు చేశారు. అయితే గత రాత్రి ఓ రెస్టారెంట్లో భోజనానికి వెళ్లిన సాంబశివరావు, పావని పై పావని తండ్రి సుధాకర్ ఆమె తమ్ముడు దాడికి తెగబడ్డారు. తమకు తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story