Chittoor: పెళ్లి బృందం బస్సు బోల్తా... ఎనిమిది మంది మృతి.. తీవ్ర గాయాలు...

Chittoor: బస్సు భాకరాపేటకు వస్తుండగా లోయలో పడిపోయింది...

Shireesha
Updated on: 27 March 2022 9:31 AM IST
Marriage Bus Accident in Chittoor Killed 8 members and Serious Injuries | AP Breaking News
X

Chittoor: పెళ్లి బృందం బస్సు బోల్తా... ఎనిమిది మంది మృతి.. తీవ్ర గాయాలు...

Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట దగ్గర పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. బస్సు భాకరాపేటకు వస్తుండగా లోయలో పడిపోయింది. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల రోదనలు, మృతదేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల్లో పిల్లలు సహా వృద్ధులున్నారు. క్షతగాత్రుల సహాకారాలతో అటుగా వెళ్లే వాహనదారులు గమనించారు.

అక్కడ బస్సు పడి ఉండటం, క్షతగాత్రులు చెల్లాచెదురై రోదిస్తుండటాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, పోలీసులు అప్రమత్తమై.. లోయలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. రాత్రి ఒంటి గంట వరకు క్షతగాత్రులను వెలికితీసి, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్‌‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

Shireesha

Shireesha

Next Story