విశాఖ ఏజెన్సీ లో మావోల అలజడి.. ప్రజా రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు !

విశాఖ ఏజెన్సీ లో మావోల అలజడి.. ప్రజా రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు !
x
Highlights

పచ్చని ప్రకృతి కాన్వాస్‌పై అందమైన చిత్రం గీసినట్లుగా వుండే విశాఖ మన్యంపై నెత్తుటి మరకలు అంటుతున్నాయి. ఎప్పుడు నివురుగప్పిన నిప్పుల ఉన్న అడవిలో మావోల...

పచ్చని ప్రకృతి కాన్వాస్‌పై అందమైన చిత్రం గీసినట్లుగా వుండే విశాఖ మన్యంపై నెత్తుటి మరకలు అంటుతున్నాయి. ఎప్పుడు నివురుగప్పిన నిప్పుల ఉన్న అడవిలో మావోల అలజడి హడలెతెత్తుంటుంది. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ జిల్లాపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపబోతుంది. దీని కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు.

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో అమాయక గిరిజనులు, అడవి అందాలు మాత్రమే కాదు. మావోయిస్టుల అలజడి, కూంబింగ్‌ల హడావుడి కూడా వుంటుంది. దట్టమైన అడవి ఉండటంతో మావోయిస్టులకు ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. దీంతో విశాఖ ఏజెన్సీ ఎప్పుడు నివురుగప్పిన నిప్పుల ఉంటుంది. పోలీసులకు, మావోలకు మధ్య జరుగుతున్న పోరులో ఎన్నో నరకంఠాలు తెగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఘటనలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం జిల్లా భధ్రతను పెంచేందుకు 95 కోట్లు నిధులు కేటాయించింది అంతేకాదు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కన్నబాబుకు బులెట్ ఫ్రూఫ్ వాహనం ను కేటాయించింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో విశాఖ కు వీవీఐపీల తాకిడి మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో నేతల భధ్రత తో పాటు ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకొని భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. విశాఖను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా ఉన్న ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఏజెన్సీలో గిరిజనులకు ఉపాధి కల్పించడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ద్వారా మాన్యంలో మవోల ప్రభావం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చూడాలి మరి విశాఖను రాబోయే రోజుల్లో సెప్టీ ప్లేస్‌ జిల్లాగా ఏలా తీర్చిదిద్దుతారో.


Show Full Article
Print Article
Next Story
More Stories