Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు మావోయిస్టుల పేరుతో లేఖ

Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్‌కు మావోయిస్టుల పేరుతో లేఖ
x
Highlights

Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పేషీకే లేఖ నేరుగా రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్రి దుర్గేశ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులను కూడా మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదంటూ బెదిరించినట్లు లేఖలో ఉంది. బెదిరింపు లేఖపై మంత్రి పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories