ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం

Maoists: మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం రావడంతో గాలింపు చర్యలు

Shekhar G
Updated on: 8 Aug 2023 8:30 AM IST
Maoist Dump Seized On Andhra Odisha Border
X

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం

Maoists: ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంపును బిఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో భారీ ఎత్తున పేలుడు సామాగ్రి ఆయుధాలు ఉన్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఏఓబి లోని మల్కనగిరి జిల్లా కలిమల పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం రావడంతో బెజ్జింగివాడ ప్రాంతంలో బిఎస్ఎఫ్ఎల్ బలగాలు గాలింపు నిర్వహించాయి. బెజ్జింగ్ వాడ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అమ్ఫాదర్, ఎలకనూరు, బొడ్లిగూడ బురదమామిడి గ్రామాలను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును బిఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 303 తుపాకీ, ఎస్బి ఎంఎల్ బ్యారెల్స్ 11, హ్యాండ్ గ్రైనేడ్లు 15, దేశీయ రాకెట్ లాంచర్ ఒకటి, 51mm మోటర్ బాంబు 1 ఎలక్ట్రికల్ డిటెనేటర్లు 30, స్వాధీనం చేసుకున్నట్లు బిఎస్ఎఫ్ బలగాలు వివరించాయి.

Shekhar G

Shekhar G

Next Story