మాన్సాస్ ట్రస్ట్ సంచలన నిర్ణయం

X
Highlights
విజయనగరం మాన్సస్ ట్రస్ట్ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విజయనగరం కోటలో ఉన్న మాన్సస్ రెవెన్యూ ఆఫీస్‌ను...
Arun Chilukuri28 Dec 2020 10:09 AM GMT
విజయనగరం మాన్సస్ ట్రస్ట్ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విజయనగరం కోటలో ఉన్న మాన్సస్ రెవెన్యూ ఆఫీస్‌ను విశాఖ జిల్లా పద్మనాభంకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు. విశాఖలోని పద్మనాభం మండలం ఎంఆర్వీఆర్‌ఆర్ కాలేజ్‌కు తరలింపుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీనిపై మెమోను ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత విడుదల చేసింది. మాన్సస్ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా ఆదేశాలు ఇచ్చారు.
1958లో మాన్సస్ ట్రస్ట్‌ను పీవీజీ రాజు స్థాపించారు. ఆవిర్భావం నుంచి కోటలోనే మాన్సస్ రెవెన్యూ ఆఫీస్ ఉండేది. పరిపాలన, నిర్వహణ, భద్రత దృష్ట్యా కార్యాలయాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందంటూ వివరణ ఇచ్చారు. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కోరుతూ మాన్సస్ ఈవో లేఖ రాశారు.
Web TitleMansas Trust take Sensational Decision
Next Story