AP BJP: ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ.. పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ

AP BJP: ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపొందిస్తాం

Arun Chilukuri
Published on: 4 March 2024 7:16 PM IST
Manifesto Committee meeting under the chairmanship of Purandeswari
X

AP BJP: ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ.. పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ

AP BJP: రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఏపీలో బిజెపి దూకుడు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన రెండో సారి మేనిఫెస్టో కమిటీ సమావేశం అయ్యింది. అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా ఎన్నికల మెనిఫెస్టో రూపొందిస్తున్నట్టు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు.

ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక క్యాలెండర్.. దళిత, నిమ్న వర్గాల వారికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ప్రధాన అంశాలుగా చేర్చుతున్నట్టు లంకా దినకర్ చెప్పారు. రైతులకు ప్రాధాన్యత, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సహకారం వంటి అంశాలపై మేనిపెస్టో కమిటీ భేటీలో చర్చించామన్నారు. వ్యవసాయ రంగానికి నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, స్థాల జాతీయ ఉత్పత్తి పెరుగుల పరిశ్రమల ఏర్పాటుకు మౌళిక వసతుల కల్ప అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఎయిర్, రైలు, రోడ్డు కనెక్టివిటీ పెంచడం, అందరికి అందుబాటులో వైద్యం ఇతర అంశాలపై చర్చించామని.. ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపొందిస్తున్నామని వివరంచారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story