మీడియాపై దాడి కేసులో రైతులకు బెయిల్ మంజూరు

మీడియాపై దాడి కేసులో రైతులకు బెయిల్ మంజూరు
x
మీడియాపై దాడి కేసులో రైతులకు బెయిల్ మంజూరు
Highlights

మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జైల్లో ఉన్న రైతులను...

మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జైల్లో ఉన్న రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారిని భయపెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను కవర్ చేసేందుకు ఈ నెల 27న మీడియా వెళ్లింది. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ దీక్షను కవర్ చేస్తుండగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు రైతులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైలులో ఉన్న ఆరుగురు రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. రాత్రి నిద్రపోతుంటే వెళ్లి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారిని భయపెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అంతకుముందు రైతుల అరెస్టులకు నిరసనగా జైలు ముందు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ.10 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories