ఒంగోలులో నడిరోడ్డుపై యువకుడి హత్య

ఒంగోలులో నడిరోడ్డుపై యువకుడి హత్య
x
Highlights

ఒంగోలులో దారుణం జరిగింది. గాంధీ పార్క్ వద్ద జోసఫ్ అనే వ్యక్తి థామస్‌ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జోసఫ్ భార్య, థామస్...

ఒంగోలులో దారుణం జరిగింది. గాంధీ పార్క్ వద్ద జోసఫ్ అనే వ్యక్తి థామస్‌ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జోసఫ్ భార్య, థామస్ ఒంగోలులోని ఓ షాపింగ్‌మాల్ లో పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్న గొడవ విషయమై జోసఫ్ యువకుడిపై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉదయం మాట్లాడదామని యువకుడిని పిలిపించిన జోసఫ్‌.. భార్య అడ్డుకుంటున్నా ఆగకుండా పలుమార్లు థామస్‌ను కత్తితో పొడిచి చంపాడు. వెంటనే అక్కడ నుంచి స్కూటీపై తన భార్యను తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనలో దాడికి గురైన థామస్‌ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇక ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ వెలుగులోకి వచ్చింది. హత్య జరుగుతుండగా కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తోన్నా.. నిందితుడు మాత్రం థామస్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. హత్య చేస్తుండగా చంపొద్దని అడ్డొచ్చిన తన భార్యను కూడా పక్కకు నెట్టేశాడు జోసఫ్‌. తన భార్యతో థామస్‌ అనుచితంగా ప్రవర్తించాడనే కారణంతోనే హత్య చేసినట్లు జోసఫ్‌ చెబుతున్నాడు. ఇక హత్యచేసిన జోసఫ్‌ తన భార్యతో కలిసి స్థానిక పీఎస్‌లో లొంగిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories