ప్రాణం తీసిన బెట్టింగ్

ప్రాణం తీసిన బెట్టింగ్
x
Highlights

గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో దిగి లక్షల్లో నష్టపోయిన ఇద్దరు యువకులు...

గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌ ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో దిగి లక్షల్లో నష్టపోయిన ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన సురేష్, బెల్లంకొండకు చెందిన కొమరయ్య బెల్లంకొండలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అప్పటికే దారిలో పురుగుల మందు తాగారు. వీరిని కుటంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతిచెందగా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది.

క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల్లో నష్టపోయామని డబ్బులు చెల్లించాలని బెట్టింగ్‌ నిర్వాహకుడు ఒత్తిడి తేవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నామన్నారు. పురుగుల మందుతాగుతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను బంధువులకు వాట్సాప్‌లో పంపించారు. కేవలం క్రికెట్ బెట్టింగ్ బుకీల ఒత్తిడి వల్లే సురేష్ చనిపోయాడని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ మహమ్మారికి మరొకరు బలి కాకూడదని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories