తల్లిపై కన్నేసి.. ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేసి..

తల్లిపై కన్నేసి.. ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేసి..
x

తల్లిపై కన్నేసి.. ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేసి..

Highlights

తల్లి లొంగలేదని పిల్లలను కిడ్నాప్ చేసిన నిందితుడు పాపను అమ్మి బాబును హత్య చేసిన కిరాతకుడు తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పట్టివేత

కామదాహం అతడ్ని నరరూప రాక్షసుడిగా మార్చేసింది. అభం, శుభం తెలియని చిన్నారులపై కన్నేసిన ఆ కామాంధుడు ఓ పసి ప్రాణం తీసేసాడు. మరో చిన్నారిని అమ్మేసాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని నూనెపల్లెలో వెలుగు చూసిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ లో చోటు చేసుకున్న విషాదాంతం ఇది.

నంద్యాల సమీపంలోని నూనెపల్లెలో జరిగిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కామాంధుడు ఓ చిన్నారి ఉసురు తీసాడు. మరో చిన్నారిని డబ్బులకు అమ్మాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊసలు లెక్కపెడుతున్నాడు. కిడ్నాప్ కు గురైన చిన్నారుల తల్లి భర్తతో విడిపోయింది. పాప, బాబుతో నూనెపల్లెలో ఉంటోన్న ఆమెను కిడ్నాపర్ కృష్ణ లొంగదీసుకోవాలనుకున్నాడు. అది కుదరక ఆమె ఇద్దరి పిల్లలను కిడ్నాప్ చేశాడు.

ఎనిమిదవ తరగతి చదువుతున్న పన్నెండేళ్ల అఫ్జల్ తో పాటు తన చెల్లి పదేళ్ల షాహీదాను కిడ్నాప్ చేశాడు కృష్ణ. పాపను బెంగళూరులో 35 వేల రూపాయలకు అమ్మగా బాబును అక్కడి నుండి నంద్యాలకు తిరిగి తీసుకు వచ్చి గొంతు నులిమి చంపి మృతదేహాన్ని కేసీ కెనాల్లో పడేసాడు.

పిల్లలు కనిపించడం లేదంటూ చిన్నారుల తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు వారు కిడ్నాప్ అయినట్టు గుర్తించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ముఖ్య కూడళ్ళలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో కృష్ణ చిన్నారులను తీసుకువెళుతున్న దృశ్యాలను గమనించారు. నిందుతుణ్ణి అదుపులోకి తీసుకోవటంతో నిజాలు బయటపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories