జనసేన అధినేత పవన్ ర్యాలీలో అపశృతి
నివర్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు కృష్ణా జిల్లాకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. రెండు కార్ల మధ్యలో బైక్ ఇరుక్కుంది. బైక్‌పై ఉన్న వ్యక్తి కాలు విరిగింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండల కనుమూరు దగ్గర చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో పవన్ టూర్ కొనసాగుతోంది. నివర్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులను కలిసి వివరాలు తెలుసుకోనున్నారు జనసేనాని నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పొలాల్లో తిరిగి నీట మునిగిన పంటలను పరిశీలిస్తున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
Next Story




