రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మండలంలో కొండలఅగ్రహారం పెట్రోల్‌బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు.

S. Srikanth
Published on: 3 Dec 2019 10:29 AM IST
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
X
ప్రతీకాత్మక చిత్రం

మాకవరపాలెం: మండలంలో కొండలఅగ్రహారం పెట్రోల్‌బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామానికి చెందిన మాకిరెడ్డి రాంబాబు (45) తన అత్తను పింఛను తీసుకునేందుకు లచ్చన్నపాలెం ఉదయం ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో కొండల అగ్రహారం వచ్చి ఇక్కడి బంకులో పెట్రోల్‌ పోయించి బయటకు వస్తున్నాడు.

ఈ సమయంలో నర్సీపట్నానికి చెందిన కె.శివ (30) ఎదురుగా వాహనంపై వస్తూ బలంగా ఢీకొట్టాడు. దీంతో రాంబాబు కింద పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో శివ కూడా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం తరలించారు.



S. Srikanth

S. Srikanth

Next Story