చిత్తూరులో పాక్ వ్యక్తి హల్‌చల్.. ఆరా తీస్తే షాక్

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. శ్రీకాళహస్తిలోని తోట్టంబేడు మండలం చియ్యవరంలో ఈ ఘటన చోటచేసుకుంది.

Samba Siva Rao
Updated on: 29 April 2020 4:21 PM IST
చిత్తూరులో పాక్ వ్యక్తి హల్‌చల్.. ఆరా తీస్తే షాక్
X
Representational Image

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. శ్రీకాళహస్తిలోని తోట్టంబేడు మండలం చియ్యవరంలో ఈ ఘటన చోటచేసుకుంది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చిన గ్రామస్తులు అతన్ని పట్టుకొని వివరాల గురించి ఆరా తీశారు. అతను పాకిస్థాన్‌ నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా శ్రీకాళహస్తిలో ఇంకా ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు చెప్పాడు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఆ వ్యక్తి వివరాలు సేకరిస్తున్నామని..అతడికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. చిత్తూరు లో గతంలో కూడా ఉగ్రవాదులు ఉన్నట్లు వార్తలు వదంతులు వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమ్తమయ్యారు. కాగా ఇలాంటి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తిరగడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story