Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు..

Pithapuram: కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది.

Arun Chilukuri
Published on: 18 May 2022 2:17 PM IST
Man Brutally Kills Mother in Law in Pithapuram
X

Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు..

Pithapuram: కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు నెలలుగా తన భార్యను కాపురానికి పంపలేదనే అక్కసుతో అత్తని నరికిచంపాడు అల్లుడు రమేష్. పిఠాపురం విద్యుత్ నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్త కందరాడకు చెందిన రమేష్ తో అయిదు సంవత్సరాల క్రితం దివ్యకు వివాహం జరిపించారు తల్లి దండ్రులు సత్యనారాయణ ,రమణమ్మ. అయితే కొంతకాలం భార్య దివ్య, తల్లి రమణమ్మ దగ్గరే ఉంటుంది. ఇక ఎంత కాలం ఎదురుచూసిన భార్యను కాపురానికి పంపట్లేదనే కోపంతో రగిలిపోయిన భర్త రమేష్ ఇంటి బయట కాపు కాసి కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అడ్డొచ్చిన రమణమ్మ భర్త, కొడుకు దిలీప్ ల పైన కూడా దాడి చేసాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story