బాపట్ల జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గుడు

బాపట్ల జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 12:02 PM IST
బాపట్ల జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గుడు
X

బాపట్ల జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం.. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గుడు

బాపట్ల జిల్లా అక్కయ్యపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను పాడుపడిన భవనంలోకి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడికట్టాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు చీరాల పోలీసులు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కటారిపాలెం జీడి తోటల్లో నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story