ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం

X
Highlights
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే...
Arun Chilukuri29 Dec 2020 10:00 AM GMT
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. వేదిక దగ్గర వంశీని మల్లవల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. గో బ్యాక్ వంశీ అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వంశీ వెనుదిరిగారు. మరోవైపు మల్లవల్లిలో భారీగా పోలీసుల మోహరించారు. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో మల్లవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.
Web Titlemalavalli villagers stop Vallabhaneni Vamsi
Next Story