Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు

Srisailam: కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యక క్యూ లైన్లలో దర‌్శనం

Dhatripriya
Published on: 5 Feb 2023 9:39 AM IST
Mahashivratri Festival Arrangements in Srisailam
X

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు

Srisailam: కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. భక్తుల రద్ధీని దృష్టిలో పెట్టుకుని తొక్కిసలాటకు తావులేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లుచేస్తున్నారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు, చంటి పిల్లలకు పాలు పంపిణీ చేసేందుకు ఈవో లవన్న చర్యలు తీసుకున్నారు. అటవీ మార్గంలో పాదయాత్రతో వచ్చే భక్తులకు ప్రత్యేకంగా దర్శనంచేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్రలో కంకణాలు ధరించిన భక్తులను మాత్రమే ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతించే విధంగా ఈవో లవన్న చర్యలు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story