Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srisailam: ఈరోజు నుంచి మార్చి 4 వరకు బ్రహ్మోత్సవాలు

Rama Rao
Published on: 22 Feb 2022 9:34 AM IST
Mahashivaratri Brahmotsavam Begins in Srisailam | AP News Today
X

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికామల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి మార్చి 4 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈరోజు ఉదయం స్వామివారు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు.. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేటి నుండి భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నారు. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం కానుంది. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ జరుగనుంది. భక్తుల కోసం దర్శనం, వసతి, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు చేశారు.వాహనాలు నిలిపేందుకు 28 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మొత్తం 8వేల వాహనాలను పార్కింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు.

Rama Rao

Rama Rao

Next Story