Delhi Liquor Scam: నేడు ఈడీ విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు

Delhi Liquor Scam: ఇవాళ విచారణకు హాజరుకానున్న మాగుంట

Jyothi
Published on: 21 March 2023 9:02 AM IST
Magunta Sreenivasulu Reddy for ED Enquiry Today
X

Delhi Liquor Scam: నేడు ఈడీ విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ముందస్తుగా నోటీసు జారీ చేసిన ఈడీ అధికారులు షెడ్యూలు ప్రకారం ఇవాళ విచారిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి సౌత్ గ్రూప్ లో కీలక పాత్రధారిగా ఉన్నారనే అభియోగాలున్నాయి. దీంతో ఇవాళ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

అయితే.. ఈనెల 18న ఎంపీ మాగుంట ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన హాజరుకాలేదు. బంధువుల అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేనని తన న్యాయవాదుల ద్వారా ఈడీ అధికారులకు సమాచారం పంపించారు. దీంతో ఇవాళ హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు పంపింది.

Jyothi

Jyothi

Next Story