తిరుమలలో మాఘపౌర్ణమి వైభవం

Tirumala: గరుడవాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి

Sriveni Erugu
Published on: 17 Feb 2022 8:24 AM IST
Maghpurnima Glory in Tirumala
X

తిరుమలలో మాఘపౌర్ణమి వైభవం

Tirumala: తిరుమలలో మాఘపౌర్ణమినాడు మలయప్పస్వామి గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార శోభితుడైన స్వామివారు మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై అధిష్టించి పున్నమినాడు లోక సంచార సంకేతంగా తిరువీధుల్లో విహరించారు. దివ్యకాంతులను ప్రసరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గరుడ సేవను కళ్లారా తిలకించిన భక్తులు పులకించిపోయారు. తిరుమల గిరులు గోవిందనామస్మరణతో మారుమోగిపోయాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story