Madanapalle: హత్యల కేసు.. పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు

Madanapalle: హత్యల కేసు.. పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు
x
Highlights

పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసిన అలేఖ్య పునర్జన్మపై నమ్మకంతోనే క్షుద్ర పూజలు క్షుద్ర పూజల్లో కీలక పాత్ర పోషించిన పెద్ద కుమార్తె అలేఖ్య

మదనపల్లి క్షుద్ర హత్యల కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. పునర్జన్మపై నమ్మకంతోనే హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షుద్ర హత్యలపై hmtv ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. క్షుద్ర పూజల్లో పెద్ద కుమార్తె అలేఖ్య కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ముందుగా ఇంట్లోని పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేసిన అలేఖ్య.

కుక్కను చంపి మళ్లీ బతికించానని ఇంట్లో వాళ్లను నమ్మించింది. అలేఖ్య మాటలను నమ్మిన తల్లిదండ్రులు క్షుద్రపూజలకు దిగినట్లు తెలుస్తోంది. ముందుగా, చిన్న కుమార్తె సాయిదివ్యపై పునర్జన్మ ప్రయోగం చేశారు. తల్లిదండ్రులతో కలిసి సాయిదివ్యపై క్షుద్రపూజలు చేసిన అలేఖ్య అందరూ కలిసి డంబెల్‌తో కొట్టిచంపేశారు. ఆ తర్వాత తనను కూడా చంపాలని కోరిన అలేఖ్య తనను తానే సగం గుండు కొట్టుకొని నోటిలో రాగి చెంబుపెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. అనంతరం, పూజగదిలో అలేఖ్యను డంబెల్‌తో కొట్టిచంపేశారు తల్లిదండ్రులు. అయితే, సాయిదివ్య మరణించిన 4గంటల తర్వాత అలేఖ‌్య హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చెల్లి మరణించిన నాలుగు గంటల తర్వాత ఏమాత్రం భయం లేకుండా చనిపోవడానికి అలేఖ్య సిద్ధమైనట్లు రిమాండ్‌ రిపోర్ట్‌‌లో ఉంది. అంతేకాదు, తాను, వెళ్లి చెల్లిని తిరిగి తీసుకొస్తానంటూ చెప్పడంతోనే తల్లిదండ్రులు అలేఖ్యను కొట్టిచంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి పునర్జన్మలపై విశ్వాసమే క్షుద్ర హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories