మదనపల్లె క్షుద్ర హత్యల్లో కొత్త విషయాలు.. భూత వైద్యుడిని రెండుసార్లు..

మదనపల్లె క్షుద్ర హత్యల్లో కొత్త విషయాలు.. భూత వైద్యుడిని రెండుసార్లు..
x
Highlights

*హత్యకు ముందు రోజు భూత వైద్యుడితో పూజలు *భూత వైద్యుడిని రెండుసార్లు ఇంటికి తీసుకెళ్లిన పద్మజ కుటుంబ సభ్యులు *అలేఖ్య, సాయిదివ్యకు తాయత్తులు కట్టిన భూత వైద్యుడు సుబ్బరామయ్య

మదనపల్లె క్షుద్ర హత్యల్లో రోజుకో కొత్త విషయం బయటికొస్తోంది. హత్యకు ముందు రోజు అంటే శనివారం బూత వైద్యుడితో పూజలు చేయించారు. మదనపల్లెలోని బూత వైద్యుడు సుబ్బరామయ్యను రెండుసార్లు ఇంటికి తీసుకెళ్లిన పద్మజ కుటుంబ సభ్యులు.... అతనితో సాయిదివ్య, అలేఖ్యకు తాయత్తులు కట్టించారు. అయితే, ఆదివారం మరోసారి రావాలని కోరగా తాను రాలేనని చెప్పినట్లు బూత వైద్యుడు సుబ్బరామయ్య తెలిపాడు. శనివారం రెండోసారి ఇంటికెళ్లినప్పుడు.... కొత్త వ్యక్తి శంఖం ఊదుతూ కనిపించాడని, అలాగే.... పెద్ద అమ్మాయి అలేఖ్య స్పృహతప్పి ఉందని అన్నాడు. దాంతో, తాను అలేఖ్యపై అరగంటపాటు మంత్రించగా ఆమె లేచి కూర్చుందని, ఆ తర్వాత తాను వెళ్లిపోయానని బూత వైద్యుడు సుబ్బరామయ్య తెలిపాడు. అమ్మాయిలిద్దరూ భయపడ్డారని చెబితేనే తాను ఇంటికి వెళ్లానని, తాయత్తులు కట్టినందుకు తనకు మూడు వందల రూపాయలు ఇచ్చారని వెల్లడించాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories