చిత్తూరు జిల్లా సబ్‌ జైలులో భయం భయం..అర్థరాత్రి పద్మజ కేకలు

చిత్తూరు జిల్లా సబ్‌ జైలులో భయం భయం..అర్థరాత్రి  పద్మజ కేకలు
x
Highlights

*అర్థరాత్రి ఎదుటి వారిని భయపెట్టేలా పద్మజ కేకలు *మహిళా వార్డ్‌లో ప్రత్యేక గదిలో ఉన్న పద్మజ *సాధారణ బ్యారక్‌లో పురుషోత్తం నాయుడు

చిత్తూరు జిల్లా సబ్‌ జైలులో అధికారులను భయపెట్టే వాతావారణం నెలకొంది. అర్థరాత్రి ఎదుటి వారిని భయపెట్టేలా పద్మజ కేకలు పెట్టింది. పద్మజ వింత ప్రవర్తనతో జైలు అధికారులు విసిగిపోయారు. పద్మజ చేష్టలతో రాత్రి నిద్ర లేకుండా గడిపారు. కన్నబిడ్డలను కొట్టిచంపామన్న బాధలేదు... ఇద్దరిని దారుణంగా హతమార్చామనే పశ్చాతాపంలేదు.... మూడు రోజులు గడుస్తున్న ఇంకా అదే మూఢ భక్తి. చనిపోయిన వాళ్లు తిరిగివస్తారనే గుడ్డి నమ్మకం... తానే శివుడినని.... ఎదుటి వారిని భయపెట్టేలా కేకలు. చిత్తూరు జిల్లా మదనపల్లేలో దారుణ హత్యకు పాల్పడ్డ పద్మజ, పురుషోత్తంల ప్రవర్తన వింతగా మారింది. వారి మానసిక పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సబ్‌ జైలులోని మహిళా విభాగంలో ఉన్న పద్మజా అర్థరాత్రి కేకలు వేసి వింతగా ప్రవర్తించింది. దీంతో నిందితులను చికిత్స కోసం తిరుపతికి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories