Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Weather Update: ఉపరితల ఆవర్తనం ప్రబావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 11:29 AM IST
Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
X

Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Weather Update: ఉపరితల ఆవర్తనం ప్రబావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తుఫాన్ గా బలపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 24 తేదీ నాటికి దక్షిణ బంగాళాఖతం మద్యభాగంలో వాయుగుండంగా బలపడనున్నది. రాగల 48 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. అదే విధంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story