Andhra Pradesh: గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ప్రేమజంట..

Andhra Pradesh: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుళ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది ఓ ప్రేమ జంట.

Arun Chilukuri
Published on: 2 May 2023 2:34 PM IST
Lovers Lock Themselves in a Temple After Marrying in Andhra Pradesh
X

Andhra Pradesh: గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ప్రేమజంట..

Andhra Pradesh: తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుళ్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది ఓ ప్రేమ జంట. కృష్ణా జిల్లా బుద్ధాలపాలెం గ్రామానికి చెందిన ప్రేమ జంట వివాహం చేసుకుంది. కులాలు వేరుకావడంతో ఈ పెళ్లిని ఇరువురి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో గ్రామంలోని దేవాలయానికి వెళ్లి దండలు మార్చుకుని తలుపులు వేసుకున్నారు. గ్రామ పెద్దలు వచ్చి తమ కుటుంబాలను ఒప్పిస్తేనే తలుపులు తెరుస్తామని చెప్పడంతో...ప్రేమజంట వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ రవికుమార్, ఎస్‌ఐ చాణక్య గ్రామ పెద్దల సహకారంతో ఇద్దరినీ బయటికి తీసుకువచ్చి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువురి తరపు బంధువులు స్టేషన్‌కు వచ్చేందుకు నిరాకరించారు. ప్రేమికులు ఇరువురూ మేజర్‌లు కావటంతో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి గ్రామ పెద్దల సమక్షంలో వారిని పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story