logo

లారీలు ఢీ.. వైసీపీనేత సజీవదహనం..

లారీలు ఢీ.. వైసీపీనేత సజీవదహనం..

ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ సజీవదహనమయ్యాడు. ఈ ఘటన పచ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో సోమవారం వేకువజామున జరిగింది. నిడదవోలు మండలం సమిశ్రగూడెంకు చెందిన డ్రైవర్‌ సవరపు హరీష్‌ (25) టిప్పర్‌ లారీలో చిప్స్‌ లోడు వేసుకుని గౌరీపట్నం నుంచి గుండుగొలను వైపునకు వెళుతున్నాడు. ఇదే క్రమంలో గుజరాత్‌ నుంచి టైల్స్‌ లోడు లారీ వస్తోంది. అయితే ప్రమాదవశాత్తు ఈ రెండు లారీలు ఢీకొన్నాయి. వదీంతో చిప్స్‌ లోడు లారీ డీజిల్‌ ట్యాంకర్‌ పగిలి మంటలు చెలరేగాయి. దాంతో

లారీ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో డ్రైవర్ హరీష్‌ సజీవదహనమయ్యాడు. టైల్స్‌ లారీ డ్రైవర్‌ మాత్రం వాహనంలోంచి దూకి ప్రాణాలను దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతిచెందిన సవరపు హరీష్‌ సమిశ్రగూడెం గ్రామ వైఎస్సార్‌ సీపీ బూత్‌ కన్వీనర్‌.. అలాగే జిల్లా శాఖలో నేతగా ఉన్నట్టు తెలుస్తోంది.

లైవ్ టీవి

Share it
Top