ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల విధ్వంసం : రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాంపై దాడి

ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల విధ్వంసం : రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాంపై దాడి
x
Highlights

ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన మరువకముందే ఇప్పుడు మళ్లీ తూర్పుగోదావరి...

ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన మరువకముందే ఇప్పుడు మళ్లీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొందురు దుండగులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై భక్తులు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

రాజమండ్రి శ్రీరామనగర్‌లోని వినాయకుడి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహంలో స్వామివారి చేతులు కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అపచారానికి పాల్పడి వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories