Tirumala: తిరుమల పుష్కరిణిలో మలయప్పస్వామి వైభవం
Tirumala: తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు
Tirumala: తిరుమల పుష్కరిణిలో మలయప్పస్వామి వైభవం
Tirumala: మంగళ కర వాయిద్యాలు... గోవిందనామ స్మరణ.. వేదమంత్రోచ్చారణల నడుమ తిరుమల పుష్కరిణిలో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. లోకసంచార సంకేతంగా పుష్కరిణి అంతర ప్రదక్షిణగా తెప్పోత్సవాలు కనుల పండువగా సాగాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో మూడో రోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా జలవిహారం చేస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని కళ్లారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. అన్నమాచార్యుల కీర్తనలు స్వామివారి తెప్పోత్సవ వైభవాన్ని సాక్షాత్కరింపజేశాయి.
Next Story




