Nara Lokesh: రేపటి నుంచి లోకేష్‌ యువగళం పాదయాత్ర రీస్టార్ట్

Nara Lokesh: ఆగిన రాజోలు నుంచే లోకేష్‌ పాదయాత్ర ప్రారంభం

Jyothi
Published on: 26 Nov 2023 11:33 AM IST
Lokesh Yuvagalam Padayatra Restart From Tomorrow
X

Nara Lokesh: రేపటి నుంచి లోకేష్‌ యువగళం పాదయాత్ర రీస్టార్ట్

Nara Lokesh: రేపటి నుంచి లోకేష్‌ యువగళం పాదయాత్ర రీస్టార్ట్‌ కానుంది. ఆగిన రాజోలు నుంచే ఈ యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్‌, విడుదల తర్వాత పరిణామాలతో లోకేష్‌ యాత్రపై ఆసక్తి నెలకొంది. వైసీపీ సర్కార్‌పై టీడీపీ పోరాటం ఎలా ఉండబోతోంది..? తమకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారని పార్టీ కేడర్‌ చర్చించుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ అలర్టయింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాంటి తప్పిదాలకు, ప్రతికూల అంశాలకు తావివ్వకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ సంఘటన జరిగినా వెంటనే స్పిందిస్తోంది. దొమ్మేరు దళిత యువకుడి ఆత్మహత్య, వైజాగ్‌ బోట్ల దహనం ఘటనలపై వేగంగా స్పందించింది వైసీపీ సర్కార్. విపక్షాల విమర్శలకు చెక్‌ పెట్టేలా వ్యూహరచన చేస్తోంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాల దూకుడుతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story