Nara Lokesh: ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర.. వల్లభనేని వంశీలపై లోకేశ్ ఎలాంటి కామెంట్స్ చేస్తారని సర్వత్రా ఉత్కంఠ

Nara Lokesh: చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీకి సిద్ధమన్న యార్లగడ్డ

Shekhar G
Published on: 21 Aug 2023 9:09 AM IST
Lokesh Padayatra In Gannavaram Constituency Today
X

Nara Lokesh: ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర.. వల్లభనేని వంశీలపై లోకేశ్ ఎలాంటి కామెంట్స్ చేస్తారని సర్వత్రా ఉత్కంఠ

Nara Lokesh: గన్నవరం... వల్లభనేని వంశీ కంచుకోట... ఈ కోటను బద్దలు కొట్టాలని టీడీపీ ఫిక్స్ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైపీపీకి మద్దతు తెలిపి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ దూసుకుపోతున్నారు వల్లభనేని వంశీ. తమ పార్టీ నుంచి గెలిచి తమనే విమర్శించడాన్ని చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా వల్లభనేని వంశీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.

అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నియోజవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డను ఈ సారి టీడీపీ తరుపున వంశీపై పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే యార్లగడ్డ చంద్రబాబుతో చర్చలు జరిపారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ సిద్ధమని యార్లగడ్డ ప్రకటించారు. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సాధించుకుంటానని చెబుతున్నారు. గన్నవరంలో రాజకీయాలు వేడెక్కిన వేళ ఇవాళ లోకేశ్ పాదయాత్ర గన్నవరంలోకి ప్రవేశించడం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

లోకేశ్ పాదయాత్రలో ఇవాళ గన్నవరంలోకి ప్రవేశించనుంది. అయితే లోకేశ్ వంశీపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు..? మాస్ లీడర్ వంశీ నుంచి లోకేశ్ విమర్శలకు ఎలాంటి కౌంటర్లు పడతాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. లోకేశ్ పాదయాత్రతో గన్నవరం టీడీపీలో కొత్త జోష్ వస్తుందా.? లేదా.? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

Shekhar G

Shekhar G

Next Story