Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు పోలీసుల అనుమతి

Nara Lokesh: లోకేష్ పాదయాత్రకు పోలీసుల అనుమతి

Jyothi
Updated on: 24 Jan 2023 1:24 PM IST
Lokesh Padayatra From Kuppam on 27th of this Month
X

Nara Lokesh: ఈ నెల 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని చెప్పారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని.. భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే పోలీసుల అనుమతిపై టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమని ఇలాంటి షరతులతో కూడిన అనుమతి తమకు వద్దని టీడీపీ నేతలు అంటున్నారు. పాదయాత్రకు టీడీపీ దరఖాస్తు చేసుకున్న విషయం, నిబంధనలకు లోబడి ఎలాంటి షరతులతో అనుమతి ఇచ్చామనే దానిపై పోలీస్ అధికారులు ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story