Om Birla: ఇవాళ ఏపీకి రానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

Om Birla: రెండు రోజులపాటు ఆలయాల సందర్శనం * సాయంత్రం 4గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం

Sandeep Eggoju
Published on: 16 Aug 2021 8:54 AM IST
Lok Sabha Speaker Om Birla Coming to Andhra Pradesh Today
X

ఇవ్వాళ ఆంధ్రప్రదేశ్ కి రానున్న ఓం బిర్లా (ఫైల్ ఇమేజ్)

Om Birla: ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని తిరుపతి పద్మావతి అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4గంటలకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5గంటలకు తిరుమలలోని శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటారు. ఇక రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా శ్రీకాళహస్తికి వెళ్తారు. సాయంత్రం 6గంటల తర్వాత స్పీకర్‌ ఓంబిర్లా ఢిల్లీకి పయనమవుతారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story