సరికొత్త ఆవిష్కరణలతో సత్తాచాటుతున్న ఈస్ట్ కోస్ట్‌ రైల్వే

సరికొత్త ఆవిష్కరణలతో సత్తాచాటుతున్న ఈస్ట్ కోస్ట్‌ రైల్వే
x
Highlights

సరికొత్త ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో సత్తాచాటుతోంది ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేరు డివిజన్ లోకో షెడ్. కరోనా విపత్తులో ఎన్నో ఆవిష్కరణలు చేపట్టిన లోకో...

సరికొత్త ఆవిష్కరణలతో జాతీయ స్థాయిలో సత్తాచాటుతోంది ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేరు డివిజన్ లోకో షెడ్. కరోనా విపత్తులో ఎన్నో ఆవిష్కరణలు చేపట్టిన లోకో షెడ్ సిబ్బంది మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వైరస్ సంక్రమణను నిరోధించే విధంగా రోగులు, వైద్య సిబ్బందికి ఉపయోగపడేలా వినూత్న రోబో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కోవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు లోకో షెడ్ చేస్తోన్న కృషి అంతాఇంతాకాదు. వైరస్ సామాజిక వ్యాప్తి నియంత్రణకు రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చింది లోకో షెడ్ సిబ్బంది. వీటికి మెడ్‌ రోబోగా నామకరణం చేశారు. కోవిడ్ రోగులకు, వైద్య సేవలు అందించే సిబ్బందికి ఉపయోగపడేలా వీటిని రూపొందించారు. అయితే ఇది ఓ ప్రత్యేకమైన మొబైల్‌ అనువర్తనం ద్వారా పనిచేస్తోంది. ఇది రోగుల శరీర ఉష్ణోగ్రతలు, లక్షణాలు తెలుసుకుని మొబైల్‌కు అందజేస్తుంది. తదనంతరం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. అయితే పలు రకాల టెస్టులు చేశాకే వీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు.

రోబోలను తయారుచేయడానికి యోట్ డ్రైవింగ్, సరోన్షస్ షీట్, రాడ్ స్క్వేర్ బార్స్, యాక్రిలిక్‌ షీట్‌ను వినియోగించారు. అదేవిధంగా వాటికి నైట్ విజన్ కెమెరాలను అమర్చారు. మొబైల్ డెస్క్‌టాప్‌ నుండి పర్యావేక్షించడంతో అన్ని దిశల్లో కదలిక కోసం రిమోట్ కంట్రోల్‌ డ్రైవ్ యూనిట్లు అలాగే సెన్సార్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ యూనిట్‌ను అమర్చారు. మందులు, ఆహారం వంటివి పంపిణీ చేయడానికి స్టైన్ లెస్‌ స్టీల్‌ ట్రేలు ఏర్పాటు చేశారు. మొత్తానికి దొండపర్తి DRM కార్యాలయానికి ఆనుకుని ఉన్న రైల్వే ఆస్పత్రిలో ప్రస్తుతం ఈ రోబో సేవలు వినియోగంలోకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories