తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీసు‌కి తాళాలు

గవర్నర్ ఆదేశాలతో సిట్ ఆఫీస్‌ సీజ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2024 1:24 PM IST
Locks to CID SIT office in Tadepalli
X

తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీసు‌కి తాళాలు

ఏపీలో ప్రభుత్వం మారుతుండటంతో.. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీసుకి తాళాలు వేశారు. ప్రభుత్వం మారుతున్న సమయంలో సిట్ ఆఫీస్‌ను సీజ్ చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చీఫ్ సెక్రెటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలు, ఇతర విభాగాధిపతి ఆఫీస్‌లలో డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో తాడేపల్లి సీఐడీ సిట్ ఆఫీస్‌కు తాళాలు వేసినపట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story