Eluru: రెడ్ జోన్ ఏరియాలలో పర్యటించిన డీఐజీ

S. Srikanth
Published on: 21 April 2020 9:11 AM IST
Eluru: రెడ్ జోన్ ఏరియాలలో పర్యటించిన డీఐజీ
X

ఏలూరు: డీఐజీ కే.వి.మోహన్ రావు ఏలూరు పట్టణ పరిధిలో ఉన్న ఫైర్ స్టేషన్ సెంటర్, అర్.అర్ పేట, తంగెళ్లముడి, తూర్పు వీధీ, వై.యస్.అర్ కాలనీ లలో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాలలో పర్యటించి చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందిను తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పికేట్ లు వద్ద ఉన్న సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది వ్యక్తులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అదే సమయంలో రోడ్డుపై అనవసరంగా సంచరిoచరాదు అని తెలియపరచిన డిఐజీ.

అనంతరం ఆర్ఆర్ పేట లో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి వైద్యాధికారులను విచారించి ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ కాంటాక్ట్ ఎంత మందికి టెస్ట్ చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చిందన్న విషయం పై విచారించారు.


S. Srikanth

S. Srikanth

Next Story