ఏపీలో మరిన్ని లాక్ డౌన్ మినహాయింపులు

కరోనా వైరస్ లాక్ డౌన్ నాలుగో దశ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ జగన్ సర్కార్ తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది.

Samba Siva Rao
Updated on: 30 May 2020 9:50 AM IST
ఏపీలో మరిన్ని లాక్ డౌన్ మినహాయింపులు
X

కరోనా వైరస్ లాక్ డౌన్ నాలుగో దశ గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తున్న వేళ జగన్ సర్కార్ తాజాగా లాక్ డౌన్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు మరికొన్ని మినహాయింపులు ఇచ్చింది.ఏపీ పరిధిలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులను ప్రకటించింది. ఏపీ పరిధిలో ప్రజారవాణా వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణికులకు అనుమతినిచ్చింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వాహనాల్లో 50 శాతం సీట్లలో ప్రయాణానికి పచ్చజెండా ఊపింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story