King Cobra: అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగులలో రాచనాగు హల్చల్

King Cobra: 12 అడుగుల నాగుపామును చూసి భయాందోళనకు గురైన స్థానికులు

Jyothi
Published on: 18 Sept 2022 7:27 AM IST
Locals Panic After Seeing A 12 Foot King Cobra
X

King Cobra: అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగులలో రాచనాగు హల్చల్

King Cobra: అనకాపల్లి జిల్లాలో 12 అడుగుల రాచనాగు హల్చల్ చేసింది. అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగుల మండలం కాశీపురం శివారు లక్ష్మీపేటలో 12 అడుగుల నాగుపామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటి ఆవరణలో బాత్రూం వద్ద రాచనాగును గుర్తించి వన్యప్రాణి సంరక్షణ సభ్యులకు సమాచారం అందించారు. ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు మూర్తి, వెంకటేశ్ అక్కడికి చేరుకొని రాచనాగును చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న పామును అటవీశాఖాధికారులతో కలిసి సుదూర అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.


Jyothi

Jyothi

Next Story