ఏపీలో చురుకుగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు

రాష్ట్ర వ్యాప్తంగా మొస్తారు నుంచి భారీ వర్షాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 Jun 2024 12:20 PM IST
Light Rains in Many Districts due to Southwesterly Influence
X

ఏపీలో చురుకుగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు

ఏపీలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. నైరుతి ప్రభావంతో పలు జిల్లాలో తెలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, బొబ్బిలి లాంటి ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మొస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరోవైపు తెలంగాణలోనూ నైరుతి ప్రభావం ఉండనున్నట్టు తెలిపింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. హైదరాబాద్‌లో నిన్న పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరవాసులు భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story