Kurnool: కర్నూలు జిల్లా కొసిగి మండలంలో చిరుత కలకలం

Leopards In Kosigi Mandal Of Kurnool District
x

Kurnool: కర్నూలు జిల్లా కొసిగి మండలంలో చిరుత కలకలం

Highlights

Kurnool: కోతులపై దాడి చేసిన చిరుత

Kurnool: కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని శివారు ప్రాంతంలో చిరుత పులుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఏడాది పైగానే చిరుతలు ఇక్కడ తరచూ దర్శనమిస్తుండడం, పెంపుడు జంతువులను చంపి తీసుకెళ్లడం షరా మామూలుగా మారింది. తిరుపతి ఘటనతో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు చిరుత సమస్య పరిష్కారం కోసం ఆందోళనకు సిద్దమవుతున్నారు. కోతులపై దాడి చేస్తున్న చిరుత పులి‌ని ప్రత్యక్షంగా చూసిన ఆ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలోని తిమ్మప్ప కొండల్లో తరచూ కన్పిస్తున్న చిరుతలు గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సారి అదే కొండ పై చిరుత ప్రత్యక్షమైంది..కొండ మీద ఉన్న కోతులపై దాడి చేసే క్రమంలో పెద్ద పెద్ద అరుపులతో ఆర్త నాదాలు చేస్తున్న కోతులను చూసి ఒక్కసారి గా ఉలిక్కి పడ్డారు కోసిగి గ్రామస్తుల. దాడి చేసే ఘటనను కళ్ళారా చూసి తీవ్ర భయభ్రాంతులకు గురైయ్యారు. ఐదు గంటల సమయంలో ఎల్లమ్మ దేవాలయం గుడి వైపు వున్న కొండపై ఉన్న కోతుల పై దాడులు చేస్తూ చిరుతలు కనిపించాయి. పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూ అదిగో చిరుత పులి అంటూ కేరింతలు కొడుతుంటే ,పెద్దలందరూ ఆందోళనకు గురయ్యారు..

చిరుత పులుల బారి నుండి కాపాడాలని ఎంతో కాలంగా అటవీ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...చిరుత లు కనిపించిన సందర్భంలో సమాచారం ఇచ్చినపుడు,పిర్యాదులు చేసి నపుడు మాత్రం అధికారులు రావడం కొండను చూసి పోవడం కామన్ గా మారిందంటున్నారు గ్రామస్తులు...ఇంత వరకు ఎన్ని పులులు వున్నాయని కానీ,వాటిని ఎలా బందించాలని కానీ,వాటి నుండి కాపాడే చర్యలు మాత్రం చేపట్టలేదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గొర్రెలను,పొట్టేళ్లను,మేకలనే కాకుండా,పాలిచ్చే పశువు లను,రక్షణ కోసం పెంచు కుంటున్న కుక్కలను చిరుతలు ఎత్తుకెళ్లి పోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు...రాత్రి సమయాల్లో సైతం ఇల్లు వదిలి బైటికి రావాలంటే తీవ్ర భయంగా వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..కొండ సమీపంలో వున్న పొలాలకు వెళ్లాలంటేనే హడలి పోతున్నారు గ్రామస్తులు... టైం కానీ టైం లో కరెంటు రావటం,పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లడానికి భయపడుతున్నారు గ్రామస్తులు. కర్నూలు జిల్లా.. కోసిగి లోని సంచరిస్తున్న పులులపై ఫారెస్టు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories