Kurnool: చిరుత కలకలం.. భయంతో కొండకు నిప్పు పెట్టిన గ్రామస్తులు

Kurnool: గ్రామంలోని పశువులు, గొర్రెలు,కుక్కలపై దాడి చేసినా స్పందించని అధికారులు

Jyothi
Updated on: 7 March 2024 9:30 AM IST
Leopard in Kurnool District
X

Kurnool: చిరుత కలకలం.. భయంతో కొండకు నిప్పు పెట్టిన గ్రామస్తులు

Kurnool: కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్‌ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురైతున్నారు. దీంతో చిరుత తమపై దాడి చేస్తుందేమోనని భయపడి గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టారు. గ్రామంలో పశువులపై చిరుత దాడి చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో గ్రామస్తులు ఉచ్చు వేసి చిరుత చిక్కింది. బంధించిన చిరుతను అధికారులు అడవిలో విడిచిపెట్టారు. మరో చిరుత కూడా సంచారిస్తుందని అధికారులకు చెప్పిన స్పందించడం లేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టారు.

Jyothi

Jyothi

Next Story