Tirumala: అదిగో పులి.. ఇదిగో ఎలుగుబంటి.. శ్రీవారి భక్తులకు మరో భయం.. టీటీడీ అధికారులకు మప్పుతిప్పలు..

Leopard And Bear Seen Again In Tirumala
x

Tirumala: అదిగో పులి.. ఇదిగో ఎలుగుబంటి.. శ్రీవారి భక్తులకు మరో భయం.. టీటీడీ అధికారులకు మప్పుతిప్పలు..

Highlights

Tirumala: స్పెషల్ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం

Tirumala: తిరుమలలో వన్యమృగాల సంచారం‌ పెరిగి‌పోయింది. గత కొద్ది రోజులుగా వన్యమృగాల సంచారంతో శ్రీవారి భక్తులు హడలి పోతున్నారు. రెండు రోజుల క్రితం చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించినప్పటకీ, శుక్రవారం రాత్రి మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద మరొ‌సారి ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డు అయ్యాయి.. అయితే తిరుమలలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఏర్పాటు చేసినా ట్రాప్ కెమెరాల్లో ఎలుగుబంటి సంచారించే దృశ్యాలు రికార్డు అయ్యాయి. వన్యమృగాల సంచారం నేపధ్యంలో అప్రమత్తంమైన టీటీడీ అటవీ శాఖా అధికారులు ఎలిఫెంట్ ఆర్చి వద్ద చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా, స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఎలుగుబంటిని బంధించేందుకు వలలను ఏర్పాటు చేశారు.

భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ అప్రమత్తమైనప్పటికీ భక్తుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఐతే ఈ ఏడాది జూన్ 22వ తారీఖున బాలుడిపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచింది తెలిసిందే. ఈ ఘటనను మరిచి పోక ముందే బాలుడిపై దాడి చేసిన సమీప ప్రాంతంలోనే బాలికపై దాడి చేసిన చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి చంపేసింది. ఈ ఘటనతో శ్రీవారి భక్తుల్లో మరింత అందోళన పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో, ఘాట్ రోడ్డులో టీటీడీ ఆంక్షలు విధించింది.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులకు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ అనుమతిని నిరాకరించింది.

అదే విధంగా అలిపిరి నడక మార్గంలో మధ్యాహ్నం రెండు గంటల వరకే 12 సంవత్సరాల లోబడిన చిన్నారులకు వారి తల్లిదండ్రులకు అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది..ఇక అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతంలో వన్యమృగాలు సంచరించే ప్రదేశాలను గుర్తించి, ఆ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బందితో పాటుగా, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి భధ్రత కల్పిస్తుంది. మరోవైపు శ్రీశైలం అటవీ శాఖ నిపుణుల పర్యావేక్షణలో మరికొన్ని ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ట్రాప్స్ అమర్చుతున్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories