Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ పాలనలో ఎప్పుడెవరికి నూకలు చెల్లుతాయో అర్థం కాని పరిస్థితి : తులసిరెడ్డి
వైసీపీ పాలనలో ఎప్పుడెవరికి నూకలు చెల్లుతాయో అర్థం కాని పరిస్థితి : తులసిరెడ్డి

X
Highlights
ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. జగన్ పాలనలో...
Arun Chilukuri30 Dec 2020 12:15 PM GMT
ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. జగన్ పాలనలో ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఎవరి ప్రాణాలకు ఎప్పుడు నూకలు చెల్లుతాయో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య మృతదేహానికి తులసి రెడ్డి నివాళి అర్పించారు. అవినీతిని ప్రశ్నించినందుకే నందం సుబ్బయ్యను హత్య చేశారని తులసి రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేత హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
Web TitleLaw and order deteriorated in YSRCP rule, says Tulasi Reddy
Next Story