logo
ఆంధ్రప్రదేశ్

Greenfield Highway: పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వివాదం

Greenfield Highway: పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వివాదం
X
Highlights

Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదంగా మారుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా జరుగుతున్న భూ సేకరణను రైతులు అడ్డుకున్నారు.

Greenfield Highway: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వివాదంగా మారుతోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా జరుగుతున్న భూ సేకరణను రైతులు అడ్డుకున్నారు. కోవిడ్ నేపధ్యంలో మరో మూడు నెలలు భూసేకరణ వాయిదా వేయాలంటూ బాధిత రైతులు డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ససేమీరా అంటూ ముందుకు అడుగులేస్తోంది. దీంతో భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతుల జీవినం ప్రశ్నార్థకమైంది.

తెలుగు రాష్ట్రాలను కలపుతూ మరో కొత్త జాతీయరహదారి గ్రీన్ ఫీల్డ్ రహదారి పేరుతో నిర్మాణ పనులు ఏపీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. దీంతో తెలంగాణా రాష్ట్రంలోని స్థానిక రైతులు తమకు అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కారు. మరోవైపు పశ్చిమగోదావరి రైతులు కూడా నష్టపరిహారం చెల్లించకుండా పంట భూముల నుండి రోడ్లెలా వేస్తారంటూ రగిలిపోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి పశ్చిమగోదావరి జిల్లాలోని 31 గ్రామాల్లో వేలాది ఎకరాలు భూ సేకరణ పనులు ప్రారంభమైయ్యాయి. దీంతో పంట భూములు సాగుకు దూరం కానున్నాయి. భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భూములు ఇచ్చిన రైతులు నష్టపరిహారంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రం నుండి ఉభయగోదావరి జిల్లాల మీదుగా మరో జాతీయ రహదారి రాబోతోంది. ఇప్పటికే సర్వే పనుల చేపట్టారు. ఈ రహాదారికి ఇరువైపులా ఉన్న భూములు, భవనాలు వంటి విలువైన స్థిరాస్తులకు నష‌్ట పరిహారం చెల్లించడం కష్ట సాధ్యం. దీంతో కొత్త జాతీయ రహాదారికి ప్రణాళికలు సిద్దం చేసారు. కొత్తగా నిర్మించబోయే రహదారి విషయంలో తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని.. సమస్యలు పరిష్కరించాలనిరైతులు కోరుతున్నారు. కరోనా వేళ పనులు వాయిదా వేయాలని మరి కొందరు రైతులు కోరుతున్నారు. మొత్తంగా తరతరాలుగా భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు అన్యాయం జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.Web TitleLand Acquisition For Greenfield Highway in West Godavari
Next Story