Lakshmi Parvathi: చంద్రబాబుకు లక్ష్మీ పార్వతి సవాల్..

Lakshmi Parvathi: ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీకి సవాల్ విసిరారు.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 8:45 PM IST
Lakshmi Parvathi Open Challenge To Chandrababu
X

Lakshmi Parvathi: చంద్రబాబుకు లక్ష్మీ పార్వతి సవాల్..

Lakshmi Parvathi: ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీకి సవాల్ విసిరారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ వేరు ఇప్పుడున్న టీడీపీ వేరని ఆమె ఎద్దేవా చేశారు. టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారని, లోకేష్ వచ్చాక పార్టీలో సంస్కారం లోపించిందని విమర్శించారు. మహానాడుకు 50 వేల మంది హాజరయితే తమ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు లక్షల మంది జనం వస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో TDP, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story